ప।। సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి
ఓహో హోహో ఓఓ హోహో ఓఓఓఓ ఓఓఓ
చ।। నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
చుట్టమల్లె కష్టమొస్తె కళ్ళనీళ్ళు పెట్టుకుంటు కాళ్ళు కడిగి స్వాగతించకు
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ చేయకు
మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలుకదా
ముసురుకొనే మిసి విలవిలలాడుతు పరుగులు తీయదా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి
ఓహో హోహో ఓఓ హోహో ఓఓఓఓఓఓఓ
చ।। ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
నిన్న రాత్రి పీడకల నేడు తలచుకొంటూ నిద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైన అందులోనె ఉంటూ లేవకుండ ఉండగలమా
కలలుగని అవి కలలే అని తెలిసినదే తెలిదమ్మా
కలతలని నీ కిలలతో తరివెయ్యవె చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి
ఓహో హోహో ఓఓ హోహో ఓఓఓఓఓఓఓ
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా
One of the best songs I’ve ever listened to, the poet takes different problems that occur in our daily life and relates them to life and hints what our attitude should be towards those problems.
The song starts with a very soft advice: Happiness is half of your strength, so be happy throughout the life.
If your eye is stopped by yesterday’s blues, can you see the good that’s going to happen tomorrow? Troubles come as your guest, don’t welcome them unnecessarily; just send them off with a smile. Just a smile is enough to drive away many blues.
Whatever problems we encounter, will life stop a moment for you? Will you not sleep just because of last night’s bad dream? Or will you sleep for ever just because you are in a nice dream? Drive all your worries away with a smile.