జులై , 2008ను భద్రపఱచు

Bommarillu – nammaka tappani nijamaina

Posted in 2000s, 2006, Sirivennela ట్యాగులతో , , , on జులై 7, 2008 by thelastpaladin

నమ్మకతప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నా మది ఇపుడైనా
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా, నీ రూపం నా చూపులనొదిలేనా

ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా, నువ్వొదిలిన ఈ ఏకాంతంలోనా
కన్నులు తెరిచే ఉన్నా నువు నిన్నటి కలవే ఐనా, ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా

నమ్మకతప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నా మది ఇపుడైనా

ఈ జన్మంతా విడిపోడదీజంట అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా
నా వెనువెంట నువ్వే లేకుండా రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా
నిలువున నను తడిమి అలా వెనుదిరిగిన చెలిమి అలా తడికనులతో నిను వెదికేది ఎలా

నమ్మకతప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నా మది ఇపుడైనా

నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళ్ళైనా ఈ నడి రాతిరి గడవదు అనుకోనా
చిరు నవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమశమా చేజారిన ఆశల తొరివరమా

నమ్మకతప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నా మది ఇపుడైనా
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా, నీ రూపం నా చూపులనొదిలేనా

A song from block buster movie Bommarillu (Telugu) which was remade in Tamil as Santosh Subramanyam. Song is in a situation where hero is sad about break up between him and heroine. Lyrics touch your heart if you ever fought with your partner.