జూన్ , 2008ను భద్రపఱచు

Swarnakamalam – ghallu ghallu ghallumantu

Posted in 1980s, 1988, Sirivennela ట్యాగులతో , , , on జూన్ 22, 2008 by thelastpaladin

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్ల మబ్బు చల్లని, చల్లని చిరు ఝల్లు
నల్ల మబ్బు చల్లని, చల్లని చిరు ఝల్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
వెల్లువొచ్చి సాగని, తొలకరి అల్లర్లు
వెల్లువొచ్చి సాగని, తొలకరి అల్లర్లు
ఎల్లనన్నవే ఎరగని వేగంతో వెళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు

లయకే నిలయమై నీ పాదం సాగాలి
మలయా నిలగతిలో సుమబాలగ తూగాలి
వలలో ఒదగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేడి

తిరిగేకాలానికి.. తిరిగేకాలానికీ తీరొకటుంది
అది నీ పాఠానికి దొరకను అంది
నటరాజ స్వామి ఝటాఝూటిలోనికి చేరకుంటే
విరుచుకుపడు సురగంగకు విలువేముంది… విలువేముంది

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు

దూకే అలలకు ఏ తాళం వేస్తారు
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్ధం

వద్దని ఆపలేరు… వద్దని ఆపలేరు ఉరికే ఊహని
హద్దులు దాటరాదు ఆశల వాహిని
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరివనముల పరిమళాల విలువేముంది… విలువేముంది…

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్ల మబ్బు చల్లని, చల్లని చిరు ఝల్లు
వెల్లువొచ్చి సాగని తొలకరి అల్లర్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు

This song has nice literature, the song is a sort of question and answer, argument between two characters. Philosophical.

Varsham – neeti mullai

Posted in 2000s, 2004, Sirivennela ట్యాగులతో , , , on జూన్ 8, 2008 by thelastpaladin

నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవానా…
జంటనల్లె బంధమల్లె ఉండిపోవే వెండివానా…

తెనెల చినుకులు చవిచూపించి
కన్నులదాహం ఇంకాపెంచి
కమ్మని కలలేమో అనిపించి
కనుమరుగై కరిగావా సిరివానా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా…
నువ్వొస్తానంటే నేనొద్దంటానా…
నువ్వొస్తానంటే నేనొద్దంటానా…
నువ్వొస్తానంటే నేనొద్దంటానా…

A sad song in the beautiful film. Short and sweet, this song is close to my heart. Each line expresses deep grief for love.