Gulabi – ee velalo neevu
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటువుంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నావైపు రానంది
దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటువుంటాను ప్రతి నిమిషము నేను
నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలమూ… గడిపేదెలా కాలమూ
పగలైన కాసేపు పనిచేసుకోనీవు
నీ మీదనే ధ్యానమూ… నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపె తోచింది
నువు కాక వేరేదీ కనిపించనంటోంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతిపోయెనేమోలే నువు నవ్వుకుంటావు
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటువుంటాను ప్రతి నిమిషము నేను
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు…
The song is from Gulabi (1996). I’m a great fan of KrishnaVamsi’s romantic movies. He is just a master in directing romantic movies. Ninne pelladutha, Chandralekha are the best mix of drama and romance.
I love this song. It has such a wonderful soothing music that whenever I want to sit back and relax, I listen to this song. Love the lyrics. Sunitha’s voice adds to it. Shashi Preetam is a master of these kind of songs.