Godavari – neelagagana ghanavichalana
నీల గగనా ఘనవిచలనా, ధరణిజ శ్రీ రమణా
మధుర వదనా నలిన నయనా మనవి వినరా రామా
రామచక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామచక్కని సీతకి…
ఉడత వీపున వేలు విడచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమచేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీత జడనూ తాళి కట్టే వేళలో
రామచక్కని సీతకి…
ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేనని పెదవి చెప్పే, చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు, నల్లని రఘురాముడు
రామచక్కని సీతకి…
చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరుపొంగిన కనులలోనా నీటి తెరలే అడ్డు నిలిచే
చూసుకోమని మనసుతెలిపే, మనసు మాటలు కాదుగా
రామచక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామచక్కని సీతకి…
ఇందువదనా కుందరదనా మందగమనా రామా
ఇందువదనా ఇందువదనా ఇంత మదనం ప్రేమా
This wonderful song is from the blockbuster Godavari. The movie itself is a masterpiece by Sekhar Kammula. This song is in a situation where the heroine realizes that she is in love with the hero. Worth mentioning is the soothing music from Radha Krishna. I love hearing to this song at work.
This song, especially, is a wonderful piece of work, yet another from Veturi. Word play at it’s best – just an example, చూడలేనని పెదవి చెప్పే, చెప్పలేమని కనులు చెప్పే, which means: lip says that it can’t see, eyes say that they cant tell.
And ఎడమచేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే, ఎత్తగలడా సీత జడనూ తాళి కట్టే వేళలో, which means: Ram lifted Siva’s bow single handed, can he lift seeta’s matted hair when he ties the knot?