ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పే దాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతిచోటా నిను నువే కలుసుకొని పలకరించుకోవా
ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు
కనపడేవెన్నెన్ని కెరటాలు, కలగలిపి సముద్రమంటారు, అడగరే ఒకొక్క అల పేరు
మనకిలా ఎదురైన ప్రతివారు, మనిషనే సంద్రాల కెరటాలు, పలకరే మనిషి అంటే ఎవరూ
సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలీ వెలుతురు నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్ని కలిపితే నువ్వేకాదా కాదా
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పే దాకా ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతిచోటా నిను నువే కలుసుకొని పలకరించుకోవా
మనసులో నీవైన భావాలే, బయట కనిపిస్తాయి దృశ్యాలై, నీడలూ నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే, ఋతువులు నీ భావచిత్రాలే
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మదిలి మదికి భాషం
పుటక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ
జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ
I was living in Bangalore when this movie was released. Seeing a new face as hero, Allari Naresh and Kamalini Mukherjee, I underestimated the film. I dint even care to see the film review. After some days, I was told by one of my friends that the movie is very good and I gotta watch the movie. But, I skipped the movie which I repented later.
I watched the movie almost an year after the movie was released. And I could not stop myself from appreciating the movie, this song and the one line
ప్రేమను ప్రేమించే ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది
This sounds like a tounge twister. I still am not sure if I get the meaning of this line 100% right. I take this as – the love that loves love loves the love that [learns to] loves for love.
My respect and appreciation for Mr. ‘Sirivennela’ increases with each song of his that I listen to. What a piece of poetry! Hats off!